బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'బోర్డర్ 2'. అనురాగ్‌సింగ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దిలిజిత్ దోసాంజే, అహాన్ శెట్టి, సోనమ్ బజ్వా తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్రబృందం వరుణ్ ధావన్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఇందులో వరుణ్ ధావన్ హోషియర్ సింగ్ దాహియా పాత్రలో గన్ పట్టుకుని శత్రువులను కాల్చుతున్నట్లు కనిపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa