విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఈ చిత్రం విడుదలకు సంబంధించి మేకర్స్ ఇంకా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదల తేదీని ఈ రోజు మేకర్స్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫుల్ జోష్ మీదున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa