‘అర్జున్ సురవరం’ గత శుక్రవారం విడుదలై మంచి టాక్ ను తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద నిఖిల్ మంచి వసూళ్లతో దూసుకువెళ్తున్నాడు. తొలి రోజునే ఈ సినిమా 4 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత రెండు రోజుల్లోను ఈ సినిమా అదే ఊపును కొనసాగించింది. అందువలన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3 రోజుల్లో 12.3 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ వారంలో ఈ సినిమాకి గట్టిపోటీ ఇచ్చే సినిమాలేవీ లేవనే చెప్పాలి. అందువలన ఈ సినిమా వసూళ్లు నిలకడగా వుండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయడం వల్లనే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబడుతోందని అంటున్నారు. మొత్తానికి కాస్త లేట్ అయినాగానీ నిఖిల్ గట్టి హిట్టే కొట్టేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa