శ్రీదేవి, బోనీ కపూర్ ల కుమార్తె జాన్వీ బాలీవుడ్ మూవీ 'ధడక్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నటుడు షాహిద్ కపూర్ కు కజిన్ అయిన ఇషాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తమ ప్రేమను బతికించుకోవడానికి కుల వివక్షపై పోరాటం చేసే ప్రేమికుల కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు, ఇంతవరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా జాన్వీకి భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంది. ఆమె ట్విట్టర్ ను ఎంతో మంది ఫాలో అవుతున్నారు. ఆమెకు సంబంధించిన ఏ వార్త అయినా వైరల్ అవుతోంది. ఆమె అందానికి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. జాన్వీ కూడా తన శరీరాకృతిని కాపాడుకోవడానికి జిమ్ లో కష్టపడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa