ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తతో మరోసారి సమంత..

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 18, 2019, 04:45 PM

టాలీవుడ్ దంపతులు నాగ చైతన్య, సమంతలు మరోసారి కలసి నటించనున్నారు.. వివాహమైన తర్వాత ఈ ఇద్దరు కలసి నటించిన మజిలీ సూపర్ హిట్ అయింది.. ఆ మూవీ తర్వాత చైతుతో సమంత జోడి కట్టనుంది..  గీతాగోవిందం ఫేమ్ పరశురామ్ 14 రీల్స్ పతాకంపై నాగ చైతన్య హీరోగా ఒక మూవీ చేయనున్నాడు..ఈ మూవీలో సమంతను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం.. ప్రస్తుతం సమంత వెబ్ సిరిస్ ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ లో బిజీగా ఉంది.. ఈ వెబ్ సిరీస్ అనంతరం ఈ కొత్త మూవీ షూటింగ్ లో పాల్గొననుంది.. కాగా, ఏం మాయ చేశావే,ఆటోనగర్ సూర్య, మనం మూవీలలో వివాహం కాకముందు చైతూ, సమంతలు కలసి నటించారు.. పెళ్లి తర్వాత మజిలీలో నటించగా, మరోసారి ఈ క్యాంబినేషన్ తెరపైకి రానుంది..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa