ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్వాంటికో వెబ్ సీరీస్ లో కాజల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 23, 2020, 06:25 PM

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హాలీవుడ్ పాపులర్ వెబ్ సీరీస్ క్వాంటికో. నాలుగు సీజన్లతో వచ్చిన ఆ వెబ్ సీరీస్ అప్పట్లో సెన్సేషనల్ గా నిలిచింది. ఓ విధంగా ప్రియాంకాకు హాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చింది ఆ వెబ్ సీరీస్ అనే చెప్పాలి. ఆ తర్వాత ప్రియాంకా నిక్ జోనస్ ను పెళ్ళాడి హ్యాపీగా అక్కడే సెటిల్ అయ్యింది. ప్రియాంకా చోప్రా నటించిన క్వాంటికో వెబ్ సీరీస్ మన దగ్గరకు రీమేక్ అవుతుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ వెబ్ సీరీస్ ను తెరకెక్కిస్తున్నారట.ఈ వెబ్ సీరీస్ కోసం సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను సంప్రదించారని తెలుస్తుంది. కాజల్ కూడా ప్రియాంకా చేసిన అన్ని సీజన్ లను చూసి క్వాంటికో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ వెబ్ సీరీస్ అక్కడ బాగా సక్సెస్ కావడంతో దీనికి ఇండియన్ వెర్షన్ నిర్మించడానికి నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ సీరీస్ కి ప్రియాంక పాత్రకి కాజల్ అగర్వాల్ ని ఎంచుకున్నారు. సో.. ఈ సీరీస్ ద్వారా కాజల్ మరింత గ్లామర్ ని కురిపిస్తుందన్న మాట!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa