దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సీటీమార్”. ఈ చిత్రం స్పోర్ట్స్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఎప్పుడు నుంచో రిలీజ్ రెడీ కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు ఎట్టకేలకు వినాయక చవితి కానుకగా రిలీజ్ అవ్వనుంది. మరి మొన్ననే ట్రైలర్ తో భారీ రెస్పాన్స్ ను అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు సెన్సార్ కంప్లీట్ చేసేసుకుంది. మరి ఈ చిత్రానికి సెన్సార్ యూనిట్ యూ/ఏ సర్టిఫికెట్ ను అందజేశారు. ఆల్రెడీ మేకర్స్ అవుట్ పుట్ పై చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ట్రైలర్ లో మంచి ఎమోషన్స్ సహా అదిరే యాక్షన్ కూడా కనిపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa