శివ దర్శకత్వంలో రజినీ కాంత్ హీరోగా రూపొందించిన చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో “పెద్దన్న” అనే టైటిల్‌తో నవంబర్ 4న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం రూ.250కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం తాజాగా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లోకి కూడా వచ్చేసింది. అయితే థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా ఈ చిత్రం హవా కొనసాగుతుందనే చెప్పాలి. రోజువారీ టాప్ 10 చిత్రాల జాబితాలో తమిళ వెర్షన్ ‘అన్నాత్తే’ మొదటి స్థానంలో ఉండగా, హిందీ వెర్షన్ సినిమా రెండో స్థానంలో, తెలుగు వెర్షన్ ‘పెద్దన్న’ 9వ స్థానంలో కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa