ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీర్తి సురేష్ కి భర్తగా మారనున్న హీరో నాగశౌర్య

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 28, 2021, 03:08 PM

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన `వేదాళం` సినిమాకు రీమేక్  ఇది. సినిమాపై భారీ  అంచనాలున్నాయి. యాక్షన్ మరియు సిస్టర్ సెంటిమెంట్ స్టోరీ ఇది. దీంతో `భోళాశంకర్`లో సిస్టర్ పాత్ర కూడా చాలా కీలకం అనే చెప్పాలి . ఈ నేపథ్యంలో మెగాస్టార్ కి చెల్లిగా నటించేది ఎవరు? అన్న దానిపై కొన్ని రోజులుగా సీరియస్ గా డిస్కషన్స్ అనంతరం స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ని ఆ పాత్రకు ఎంపిక చేసారు. దీంతో కీర్తి ఎంట్రీ  సినిమాకి అదనపు బలంగా చెప్పుకోవచ్చు. కీర్తి సురేష్ కి టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు ఉంది. ఇటీవల విడుదలైన  కోలీవుడ్ సినిమా `అన్నాథై` లో సూపర్ స్టార్ రజనీకాంత్ కి  చెల్లెలి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అక్కడ పెద్ద హిట్  అయింది. దీంతో `భోళా శంకర్` లో కీర్తి సురేష్ ఎంట్రీ అంచనాల్ని పెంచడం ఖాయం. తాజాగా ఇందులో కీర్తిసురేష్ కి భర్త పాత్రలో యంగ్ హీరో నాగశౌర్య ని ఎంపిక చేసినట్లు సమాచారం. మెగాస్టార్ సినిమా కావడంతోనే యంగ్ హీరో ఈ రోల్ ని ఒకే చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అధికారికంగా వెల్లడిస్తే గానీ దీనిపై క్లారిటీ రాదు. మెగాస్టార్ అంటే నాగశౌర్యకి ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు. మెగాస్టార్ తో తెరను పంచుకోవాలంటే ఎంతో అదృష్టం కూడా కలిసి రావాలి. ఇప్పుడు ఆ ఛాన్స్ నాగశౌర్యకి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa