ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“వలిమై” ట్రైలర్ భారీ రెస్పాన్స్..!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 09:23 AM

 హెచ్ వినోట్ దర్శకత్వంలో హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “వలిమై”. తెలుగులో “బలం” పేరిట రేలసే కానున్న ఈ సినిమా నుంచి ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ ట్రైలర్ ని మేకర్స్ నిన్న రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదల కావడంతోనే భారీ రెస్పాన్స్ ని అందుకుంది. కేవలం మూడు గంటల్లోనే 1 మిలియన్ లైక్స్ అందుకొని సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మూడో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ ట్రైలర్ గా దీనిని సెట్ చేశారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో నిండిపోయిన ఈ ట్రైలర్ లో మన టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్ గా ఆసక్తిగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతానికి అయితే 1.1 మిలియన్ లైక్స్ మరియు 9 మిలియన్ వ్యూస్ కి దగ్గరలో ఈ భారీ యాక్షన్ ట్రైలర్ కట్ ఉంది. అలాగే తెలుగు మరియు హిందీ వెర్షన్ లలో ఈ ట్రైలర్ వచ్చే వారం రిలీజ్ కానున్నట్టుగా టాక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa