కాజల్ బేబి బంప్ తో మరోసారి అభిమానులకు కనిపించింది. అయితే ఈ సారి మాత్రం మాములు గా కాదండీ..బేబి బంప్ తో జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తుంది. ప్రత్యేకంగా ఒక ట్రైనర్ తో స్వల్పంగా వర్క్ ఔట్స్ చేస్తుంది. బేబి బంప్ ఉన్నా.. తగ్గేదే లే.. అంటు జిమ్ లో కష్ట పడుతుంది. ఈ వీడియోను కాజల్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. కాగ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగ ప్రెగ్నెన్సీ సమయంలో బద్ధకంగా ఉండకుండా.. ఆరోగ్యం కోసం కాజల్ వర్క్ ఔట్స్ చేయడంతో అభిమానులు కాజల్ ను ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa