బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్, షిబానీ దండేకర్ చాలా ఏళ్లుగా ప్రేమించుకుని ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించగా, మరికొందరు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లయినప్పటి నుంచి ఈ జంట కొత్త ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ జంట తమ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఫర్హాన్ వైట్ అండ్ వైట్ జాకెట్లో స్టైలిష్ లుక్తో కనిపించగా, తన భర్త పక్కన షిబానీ గ్లామరస్ డిజైనర్ డ్రెస్లో కనిపించింది. అయితే ఈ ఫోటోలో శిబాని పొట్ట కాస్త పొడుచుకు వచ్చినట్లు కనిపించింది. అది గమనించిన నెటిజన్లు.. అప్పుడే గర్భం దాల్చిందా..? అడుగుతున్నారు. మరికొందరు పెళ్లికి ముందే అమ్మడు గర్భవతి అని.. అందుకే త్వరగా పెళ్లి చేసుకో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై ఈ జంట క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa