తేజ సజ్జ ప్రధానపాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మూవీ 'హను మాన్'. ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో నటిస్తున్న వరలక్ష్మి శరత్‌కుమార్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె నెగిటివ్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. కాగా ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa