ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో సూర్య సరసన బేబమ్మ?

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 03:12 PM

మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ నటించిన ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను పలకరించింది కృతి శెట్టి. తరువాత  శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలలో నటించి వరస విజయాలను అందుకుంది. తొలి మూడు సినిమాలతో హిట్లు కొట్టి టాలీఫుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది బేబమ్మ. 


ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు పక్కన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' లో, నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' లో, హీరో రామ్ తో 'ది వారియర్' సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. 


తాజాగా కృతి శెట్టి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పక్కన నటించే అవకాశాన్ని కొట్టేసిందని చిత్రవర్గ సమాచారం. సూర్య ఎత్తరుక్కుమ్ తునింధవన్ తర్వాతి సినిమాని స్టార్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో చేయనున్నారు. ఏప్రిల్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవనుంది. ఈ మూవీలో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. దీనికి సంబంధించి కృతితో నిర్మాతలు సంప్రదింపులు జరిపారట. కృతి మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదని టాక్. బేబమ్మ ఈ సినిమాకి పచ్చజెండా ఊపితే కోలీవుడ్లో ఇదే ఆమెకు డెబ్యూ మూవీ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa