ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బర్త్ డే పార్టీలో సెంటర్ ఆఫ్ ఎట్ట్రాక్షన్ గా లైగర్ టీం... బ్లాక్ అండ్ బ్లాక్ లో అదరగొట్టేసారుగా...

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 18, 2022, 01:27 PM

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఐన ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా బర్త్ డే పార్టీ నిన్న రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీ లో ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న లైగర్ మూవీ టీం కూడా పాల్గొని సందడి చేశారు. 


లైగర్ చిత్ర దర్శకుడు పూరి జగన్నాధ్, హీరో విజయ్ దేవరకొండ, కో-ప్రొడ్యూసర్ ఛార్మి ఈ పార్టీలో బ్లాక్ బ్లాక్ డ్రెస్ కోడ్ తో పాల్గొని సెంటర్ ఆఫ్ ఎట్ట్రాక్షన్ గా నిలిచారు. ఛార్మి,పూరీలు మీడియాకి సైలిష్ ఫోజులిస్తూ హంగామా చేశారు. 


ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా లైగర్ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్ట్రెస్ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తుంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు. సౌత్ లో విజయ్ దేవరకొండకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్లో కూడా పాపులర్ అవ్వాలనుకుంటున్నాడు విజయ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa