టాలీవుడ్ యువనటుడు నితిన్ హీరోగా MS. రాజశేఖర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఒక కొత్త వార్త వచ్చింది. ఈ నెల 26న అంటే ఎల్లుండి ఈ సినిమా నుండి నితిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలియజేసే పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం.
మ్యాస్ట్రో లో బ్లైండ్ గా నటించిన నితిన్ ఈ సినిమాలో ఎటువంటి క్యారెక్టర్ లో నటించనున్నాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa