ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "పుష్ప:ది రైజ్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కాసుల వర్షం కురిపించింది.ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.సమంత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది.ఈ సాంగ్ తో సామ్ క్రేజ్ మరింత పెరిగింది.పుష్ప సినిమాతో భారీ హిట్ కొట్టిన అల్లుఅర్జున్ ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తో తన అభిమానులను అండ్ ప్రేక్షకులను మరోసారి అలరించడానికి రెడీ అవుతున్నాడు.ఇప్పుడు పుష్పపార్ట్ 2 స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.ఈ స్పెషల్ ని సిజ్లింగ్ బ్యూటీ దిశా పటాని చేస్తున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది అని మేకర్స్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa