ఆర్ఆర్ఆర్ చిత్రంలోని అద్బుతమైన సన్నివేశాలపై ఆ చిత్ర దర్శకులు రాజమౌళి స్పందించారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' విడుదల సమయం దగ్గరికి వచ్చేసింది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఏ స్థాయిలో రికార్డులను సృష్టించనుందనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ .. " ఈ సినిమాలో ట్రైన్ బ్లాస్ట్ సీన్ ఉంటుంది. మినియేచర్ సెట్ వేసి .. సీజీలో కంపార్ట్ మెంట్ ను బ్లాస్ట్ చేయడం జరిగింది. ఈ సన్నివేశం అద్భుతంగా వచ్చింది. ఇది తెరపై చాలా సహజంగా .. భారీగా కనిపిస్తుంది. ఈ సీన్ చూస్తూ అంతా కూడా విస్మయానికి లోనవుతారు. ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే, దీనిని ఎలా తీశారబ్బా? అనే ఆలోచన చేస్తూనే ఉంటారు. అంతగా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. అడుగడుగున ఎదురయ్యే అనూహ్యమైన మలుపులు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఈ ఫీల్ ను పదే పదే పొందడానికి మళ్లీ మళ్లీ థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు" అని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa