రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ జంటగా తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం RRR. మార్చి 25 శుక్రవారం విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ,ఈ చిత్రం హిందీ వెర్షన్ తొలిరోజు రూ.18 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. USలో, ప్రీమియర్లతో సహా మొదటి రోజు 5 మిలియన్లకు పైగా వసూలు చేసింది. దీంతో బాహుబలి-2 తొలి రోజు మార్క్ (4.59) దాటేసింది. తెలుగు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్‌ల జీవిత చరిత్రకు కల్పిత కథను జోడించి RRR సినిమా తీశారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa