అభిమానులు ఎప్పటినుంచో చూస్తున్న రోజు రానే వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అని అభివర్ణిస్తున్నారు. ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త హద్దులు ఏర్పాటు చేశారని కితాబునిచ్చారు.