పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాలో శ్రీరాముడిగా కనిపించనున్నారు ప్రభాస్. ఆయన సరసన సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తుండగా, లంకాధిపతి రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయినప్పటికీ, వచ్చే సంవత్సరం జనవరి 12నే ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రవర్గం అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.. చారిత్రక చిత్రంగా రానున్న ఈ మూవీ విఎఫ్ఎక్స్ పనులకోసమే విడుదల ఆలస్యమవుతుందని చిత్రబృందం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఈ మూవీ నుండి ఎలాంటి ఇంటరెస్టింగ్ అప్డేట్ కూడా రాకపోవటంతో అభిమానులు ఒకింత అసహనానికి గురైన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ మూవీ నుండి ఒక కొత్త న్యూస్ బయటకు వచ్చింది. ఏప్రిల్ 10 న శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ నుండి ఒక బిగ్ అప్డేట్ రానుందని చిత్రవర్గ సమాచారం. అయితే అది ప్రభాస్ ఫస్ట్ లుక్కా? లేక టీజేరా? గ్లిమ్ప్స్? అనేది క్లారిటీ లేదు. కానీ వీటిలోనుండి ఏదో ఒకటి ఖచ్చితంగా రానుందని టాక్. రాధేశ్యామ్ పరాజయంతో నిరుత్సాహపడిన ప్రభాస్ అభిమానులకు పండగలాంటి వార్త బయటకు రావటంతో సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K తోనూ బిజీగా ఉన్నారు ప్రభాస్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa