ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కళావతి' సాంగ్ విషయంలో థమన్ చెప్పిందే జరిగింది - మహేష్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 09:01 PM

పరశురామ్ డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'సర్కారువారిపాట'. కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  సర్కారువారి పాట నుండి తొలుత విడుదలైన లిరికల్ సాంగ్ కళావతి. వినటానికి, చూడటానికి కూడా అద్భుతంగా ఉన్న ఈ పాట ఇప్పటికి 167మిలియన్ వ్యూస్ తో యూట్యూబులో దుమ్ము రేపుతోంది. మహేష్ క్లాస్సీ అండ్ క్యాచీ స్టెప్స్ , ఆయన లుక్ అండ్ స్టైల్, కీర్తి గ్లామర్ ఈ పాటకు ప్రధానాకర్షణ. అయితే, ఇంత సూపర్ హిట్ ఐన పాట తొలిసారి విన్నపుడు దర్శకుడు పరశురామ్ కు, సూపర్ స్టార్ కు ఈ పాటా కొంచం స్లో గా ఉంది వర్క్ అవుట్ అవుతుందా అని సందేహంలో ఉన్నారు అంటా. అయితే తమన్ మాత్రం ఈ పాట మీద చాలా నమ్మకంగా  ఉన్నాడని, ప్రతి చోటా ఈ పాట ప్లే అవుతుందని మమ్మల్ని కన్విన్స్ చేసి మరీ ఈ పాట లిరికల్ వెర్షన్ ను రిలీజ్ చేసాడు. ఇప్పుడు అతను చెప్పినట్లే జరుగుతోందని మహేష్ తెలిపాడు. తనకు కూడా ఈ పాట ఫెవరెట్ గా మారిందని మహేష్ పేర్కొన్నారు.ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో మహేష్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa