కెరీర్ లో చేసింది నాలుగే నాలుగు సినిమాలు... అందులో ఒకే ఒక్క హిట్. కానీ ఐదో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో తెలిస్తే ఖచ్చితంగా అందరు షాక్ అవుతారు. ఎవరబ్బా..ఆ హీరో..? అని అనుకుంటున్నారా...! అక్కినేని అఖిల్.
అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ... చేసిన నాలుగు సినిమాల్లో, ఆఖరి సినిమాతో తొలి సూపర్ హిట్ ను అందుకున్న అఖిల్ కు యూత్ లో సూపర్ క్రేజ్ ఉంది. లవర్ బాయ్ ఇమేజ్ కు కూసింత విరామమిచ్చి, కండలు, జుట్టు పెంచి, ఒంటినిండా ట్యాట్టూలు వేయించుకుని మోడరన్ బీస్ట్ లా తయారయ్యాడు అఖిల్. ఇదంతా తన ఐదవ సినిమా ఏజెంట్ కోసం. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ ఒక ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఇందుకోసం తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు అఖిల్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. ఏజెంట్ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
ఈ విషయం పక్కన పెడితే, ఏజెంట్ మూవీ దాదాపు రూ. 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ఇండస్ట్రీ టాక్. దీంతో టైర్ 2 హీరోల్లో అంటే, నాని, శర్వానంద్, రామ్, నితిన్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్,నాగ చైతన్య వంటి వారిని దాటుకుని అఖిల్ ఏకంగా డెబ్బై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోవడం నిజంగా గ్రేట్. ఇదొక రికార్డు అన్నమాట. ఐతే, ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉన్న ఈ సినిమాపై వస్తున్న తాజా వార్తపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.