'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ప్రాజెక్ట్ కే" చిత్రంలో బాలీవుడ్ గ్లామర్ డాల్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని ఒక కీలకపాత్రలో నటించబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే, ఈ రోల్ కు గాను దిశా భారీమొత్తంలో పారితోషికం అందుకుంటుందని ఒక హాట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న దీపికా కన్నా దిశానే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకోబోతుందంటే, ప్రాజెక్ట్ కే లో దిశా ఎంతటి పవర్ఫుల్ రోల్ లో నటించబోతుందో క్లియర్ గా అర్ధమవుతుంది.
పూరీజగన్నాధ్ డైరెక్షన్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన "లోఫర్" సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది దిశా పటాని. ఆ తర్వాత దిశా కు తెలుగులో అవకాశాలు దక్కకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో దిశా ఒకరు. ఇంస్టాగ్రామ్ లో దిశాకు 51 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదా...!