ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫీషియల్: సూపర్ స్టార్ అభిమానిగా అక్కినేని హీరో..!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 18, 2022, 03:44 PM

"థాంక్యూ" చిత్రంలో అక్కినేని నాగచైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబుకు అభిమానిగా నటిస్తున్నట్టు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయం నిజమేనని చెప్తూ, అభిమానులకు క్లారిటీ ఇచ్చారు రచయిత BVS రవి. సినిమాలో చైతు పేరు అభిరాం. టీనేజ్ లో , గ్రాడ్యుయేషన్ డేస్ లో అభిరాం సూపర్ స్టార్ మహేష్ బాబుకు వీరాభిమాని అని, మహేష్ మూవీ ఫ్లెక్సీ , బ్యానర్ లను థాంక్యూ టీజర్, ట్రైలర్ లలో మనకు కనిపిస్తాయని చెప్పారు. సూపర్ స్టార్ కు అక్కినేని హీరో అభిమానిగా నటించడం అంటే, ఈ సినిమాకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది.
అక్కినేని యువనటుడు నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించగా, తమన్ సంగీతం అందించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా టైం తీసుకుంది.  పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూలై 8న విడుదలవుతుందనుకున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. జులై 22 న థియేటర్లలో సినిమా విడుదలవుతుందని ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa