ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చై 'ధూత' వెబ్ సిరీస్ గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 20, 2022, 05:30 PM

అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ హర్రర్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి "దూత" అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. హారర్ థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ వెబ్ సిరీస్ లో నాగ చైతన్య సరసన ప్రియా భవానీ శంకర్ జంటగా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు థ్యాంక్యూ మూవీ ప్రమోషన్ లో నాగ చైతన్య ఈ సిరీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ షూటింగ్ దాదాపు పూర్తయిందని, జనవరి నాటికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చే అవకాశం ఉందని చై తెలిపారు. ఈ సిరీస్ తమిళం మరియు తెలుగులో విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa