టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు కడాలి జయ సారధి(83) సోమవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ, లంగ్స్ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నెల రోజులుగా హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. 1960లో సీతారామ కళ్యాణంతో వెండితెరకు పరిచయమైన ఆయన.. దాదాపు 372 తెలుగు సినిమాల్లో నటించారు. జయ సారథి మృతిపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.