వినయ విధేయ రామ ఫస్ట్ లుక్ విడుదల .మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన 12వ చిత్రంగా బోయపాటి శీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి ఇదే టైటిల్‌ని కన్‌ఫాం చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో చరణ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. రంగస్థలంలో పల్లెటూరి వ్యక్తిగా కనిపించిన చెర్రీ ఈ చిత్రంలో తన లుక్‌తో మరింత ఆకట్టుకోనున్నాడు. చిత్ర టీజర్ నవంబర్ 9 ఉదయం 10.25ని.లకి విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో వివేక్ ఒబేరాయ్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.
భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. స్నేహ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు . చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేం), నవీన్ చంద్ర లు నటిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీ స్టారర్ చేయనున్నాడు. ఈ మూవీలో చెర్రీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తుంది.
Without Logos#VinayaVidheyaRama #VinayaVidheyaRama1stLook pic.twitter.com/KQr8xMk3NX
— Vamsi Kaka (@vamsikaka) November 6, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa