రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR సినిమా ఎంత పెద్ద హిట్టో, అందులోని నాటు నాటు సాంగ్ అంతే పెద్ద హిట్టయ్యింది. ముఖ్యంగా ఆ పాటలో చెర్రీ, తారక్ వేసే హుక్ స్టెప్ కి గ్లోబల్ లెవెల్లో విశేష స్పందన వచ్చింది. ఎంతోమంది నెటిజన్లు, స్టార్లు ఈ హుక్ స్టెప్ కు కాలు కదిపారు. వాటిని రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు.
తాజాగా ఈ హుక్ స్టెప్ కు ఇద్దరు టాలీవుడ్ భామలు కాలు కదిపారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇంతకూ ఆ హీరోయిన్స్ ఎవరనుకుంటున్నారా?... ఇటీవల విడుదలైన ఓరి దేవుడా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన మిథిలా పాల్కర్, ఆశా భట్. నిన్న జరిగిన దివాళి బాష్ లో ఈ ఇద్దరు భామలు RRR నాటు నాటు సాంగ్ హుక్ స్టెప్ కు కాలు కదపడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa