ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వాసం మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చేలా ఉందట

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 10, 2019, 05:07 PM

తల అజిత్ నటించిన తాజా చిత్రం ‘విశ్వాసం’ తమిళ వెర్షన్ ఈ రోజు భారీ అంచనాల మధ్య విడుదలైయింది. ఇక ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్ , డైలాగ్ డిలీవరీ అలాగే హీరో ఇంట్రో సీన్ , ఇంటర్వెల్ ఫైట్ సీన్ సినిమాకి మేజర్ హైలైట్స్ గా నిలిచాయట.


ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చేలా ఉందట. ఇక క్లైమాక్స్ , స్క్రీన్ ప్లే అలాగే జగపతి బాబు ప్రతినాయకుడి పాత్ర సినిమాకి మైనస్ పాయింట్స్ అయ్యాయట. ఓవరాల్ గ ఈచిత్రం ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేసేలా ఉందట.


ఇక ఈ చిత్రం తెలుగులో ఈ నెల 25న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే దానికి సంబందించిన డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. మరి ఈ చిత్రం తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa