ఏప్రిల్ 2015లో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, ఆపై, తరచూ పోస్టులు పెడుతూ, తనకు, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ, వారికి మరింతగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఆయన ఫాలోవర్ల సంఖ్య 30 లక్షలను (3 మిలియన్ మార్క్) దాటింది. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండటమే ఆయనకు ఈ ఘనతను సాధించి పెట్టిందనడంలో సందేహం లేదు.
ఇక ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన బన్నీ, "ట్విట్టర్ లో 3 మిలియన్ ఫాలోవర్లకు చేరినందుకు మీకందరికీ కృతజ్ఞతలు. మీరు నాపై చూపించే ప్రేమే ఇందుకు కారణం. ఇందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నా బలం కాదు. అభిమానుల దీవెనలే. థ్యాంక్యూ" అని వ్యాఖ్యానించాడు. కాగా, 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' తరువాత మరో సినిమాను అంగీకరించని అల్లు అర్జున్, త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే క్రేజీ ప్రాజెక్టులో నటించనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa