గత సంవత్సరం తమిళంలో '96' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది చార్మింగ్ బ్యూటీ 'త్రిష' . ఆ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచింది. అందుకుగాను ఆమెకు చాల అవార్డులు తన ముందర నిలిచాయి. 35 సంవత్సరాలు వచ్చిన ఇంకా పెళ్లిచేసుకోలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను సింగిల్ అని.. ఎవ్వరినీ ప్రేమించలేదని తెలిపింది. అయితే తనకు తగినవాడు తారసపడితే మాత్రం వివాహం చేసుకునేందుకు సిద్ధంగా వున్నానని త్రిష వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa