నటి ‘పూజాహెగ్డే’ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “తుఫాను ముందు ప్రశాంతత. ఈ ఏడాదిలో నేను చేయాల్సిన సినిమాల వర్క్ ను ప్రారంభించేముందు ఆస్వాదిస్తున్న చివరి ప్రశాంతమైన మునక” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పూల బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ కెమెరాకు ఒక అందమైన పోజిచ్చింది. ఆ పింక్ లిప్స్.. ఎర్రగా కందిన బుగ్గలను చూస్తేనే పూజా అందం ఏ రేంజ్ లో ఉందో మనకు అర్థం అవుతుంది. కూలింగ్ గ్లాసెస్ ను తలపై స్టైల్ గా పెట్టుకుంది. అంతే కాదు.. పూజ కళ్ళలో ఒకరకమైన స్పార్క్ కనిపిస్తోంది. ఈ ఫోటోను పోస్ట్ చేసిన ఇరవై గంటలలోపే నాలుగు లక్షల లైక్స్ వచ్చాయి. ఒకరు “అందాల అయస్కాంతం” అన్నారు. మరొకరు “హసీన్ లడ్కీ హసీన్ చెహెరా” అన్నారు. ఇంకొకరు “షిమ్లా యాపిల్ లా ఉన్నావు” అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa