మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన లూసిఫర్ చిత్రం ఘనవిజయం అందుకుంది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ గా అదే కాంబినేషన్ లో వస్తున్న చిత్రం L2E ఎంపురాన్. మరోసారి మోహన్ లాల్-సుకుమారన్ కాంబినేషన్ బాక్సాఫీసును ఊపేసేందుకు సిద్ధమవుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టీజర్ ను నేడు కొచ్చిలో విడుదల చేశారు. టీజర్ లో సన్నివేశాలు చూస్తుంటే వేరే లెవల్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా అని అర్థమవుతోంది. ఎక్కడా రాజీపడకుండా ప్రతి ఫ్రేమ్ ను క్వాలిటీతో తెరకెక్కించినట్టు తెలుస్తోంది.నటుడిగా అందరికీ తెలిసిన పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం అనగానే... గతంలో అందరూ కాస్త సందేహంగా చూశారు. లూసిఫర్ తిరుగులేని హిట్ అయ్యాక... అతడి డైరెక్షన్ టాలెంట్ ఏంటో అందరికీ అర్థమైంది. దాంతో L2E ఎంపురాన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దీపక్ దేవ్ సంగీతం అందిస్తున్నారు