యువ కథానాయకుడు సుహాస్ తన విభిన్నమైన కథల ఎంపికతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈసారి మరో అందమైన ప్రేమకథా చిత్రం ‘ ఓ భామ అయ్యో రామ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) కథానాయికగా పరిచయం అవుతున్నారు. రామ్ గోధల దర్శకత్వంలో హరిష్ నల్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా విడుదల చేయనుంది. కాగా, ప్రేమికుల రోజు సందర్భంగా పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో సుహాస్, మాళవిక మనోజ్‌ల రొమాన్స్‌ను చూపిస్తూ, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa