|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 05:32 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం తన పదవికి గండం పొంచి ఉందనే భయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో మొదలైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మానసిక స్థితి దెబ్బతిన్నట్లుందని అందుకే సందర్భం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని చూసి సిగ్గే సిగ్గుపడేలా ఉందని వ్యాఖ్యానించారు. నగరంలో నిఘా పెట్టేందుకు కేసీఆర్ కమాండ్ కంట్రోల్ నిర్మిస్తే, రేవంత్ రెడ్డి అదే కమాండ్ కంట్రోల్‌లో కూర్చొని తమపై నిఘా పెడుతున్నారని మండిపడ్డారు. ప్రగతిభవన్‌లో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, కమాండ్ కంట్రోల్, సచివాలయం అంశాలపై కమిషన్ వేయవచ్చు కదా అని ప్రశ్నించారు.