|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 06:33 PM
ఈరోజు జిహెచ్ఎంసి నిజాంపేట్ సర్కిల్ పరిధి బాచుపల్లి లోని డబుల్ బెడ్ రూమ్ ఇలా సముదాయాలలో నిర్వహించిన "బాచుపల్లి 2 బిహెచ్కె ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్" ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... కుల, మత, వర్గ, వర్ణాలకు అతీతంగా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబ సొంతింటి కలను నెరవేర్చిన మహాత్ముడు, పెద్దలు కేసీఆర్ గారు అని అన్నారు. ప్రైవేట్ డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా అన్ని సదుపాయాలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందజేసి దేశంలోనే మరెక్కడా లేనివిధంగా విశాలవంతమైన డబుల్ బెడ్ రూమ్ సముదాయాలను ఇచ్చిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నెలకొని ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, రానున్న రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలోని వారంతా ఐకమత్యంగా ఉండి ఆదర్శవంతమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంగా బాచుపల్లిని అభివృద్ధి పరచాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం సభ్యులకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయడంతో పాటు అక్కడే నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను ప్రధాన చేశారు.
బాచుపల్లి 2 బిహెచ్కె ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ నూతన కమిటీ...._* చైర్ పర్సన్ - మహమ్మద్ ఫర్జానా సలీం, ఉపాధ్యక్షులు - దమయంతి బిపిన్, ప్రధాన కార్యదర్శి ఎం . కేజియా రాజు, కోశాధికారి షేక్ అజ్మీరి అహ్మద్...ఈ కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు బాలాజీ నాయక్, పెద్దిరెడ్డి సుజాత,రాఘవేంద్రరావు, రవి కిరణ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఏనుగుల అభిషేక్ రెడ్డి, చంద్రగిరి జ్యోతి సతీష్, బిఆర్ఎస్ నాయకులు సాంబశివరెడ్డి, బైండ్ల నగేష్,ప్రదీప్, మల్లేష్, బిక్షపతి, ముత్యాలు, జస్వంత్, యాదగిరి, బొబ్బ శ్రీనివాస్, జలగం చంద్రయ్య,విద్య సాగర్, ఎండీ.సలీం, మహిళా అధ్యక్షురాలు అర్పిత ప్రకాష్, మహిళా నాయకురాలు నర్మదా, స్వర్ణకుమారి, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.