|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 04:07 PM
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని, చలిగాలులు వీస్తాయని తెలిపింది. కోల్డ్‌వేవ్ పరిస్థితుల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుందని, పగటి ఉష్ణోగ్రతలు 25-26 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ చలి తీవ్రత పెరుగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడు రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.