|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:09 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, డ్రైవింగ్ లో సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వేములవాడ కమాన్ వద్ద కార్లను తనిఖీ చేసి, ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, మద్యం తాగి నడపవద్దని, రాంగ్ రూట్ లో వెళ్లకూడదని, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని, స్పీడ్ కంట్రోల్ లో ఉండాలని, రివర్స్ లో వెళ్లేప్పుడు జాగ్రత్త వహించాలని వాహనదారులకు సూచించారు. సీటు బెల్టు పెట్టుకున్న వారికి స్వీట్లు పంపిణీ చేసి, ధరించని వారికి దాని ప్రాముఖ్యతను వివరించారు. వాహనాలకు భద్రతా స్టిక్కర్లు అతికించి, సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనం నడుపుతామని ప్రతిజ్ఞ చేయించారు.