|
|
by Suryaa Desk | Thu, Jan 01, 2026, 03:11 PM
పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి 7 గ్రాములు కొకైన్ సీజ్ చేశారు. పోలీసులకథనం ప్రకారం.. ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారం మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో దాడులు చేశారు. రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ (46), గోవాకు చెందిన విజయ్ నుంచి ఏడు గ్రాముల కొకైన్ డ్రగ్ తో పాటు రెండు సెల్ ఫోన్లు సీజ్ చేశారు. అనంతరం నిందితులను నార్సింగి పోలీసులకు అప్పగించారు. శ్రీనివాస్ ను హాస్పిటల్ కి తరలించి టెస్ట్ చేయడంతో డ్రగ్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. ఈ డ్రగ్స్ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తుంది.. వీరిపై గతంలో ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.