|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 02:31 PM
నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాల మధ్య, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని, మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ తొలగించి వాహనాలు నడుపుతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీజేలు, అధిక శబ్ద పరికరాలపై పూర్తి నిషేధం విధించామని, ఉల్లంఘిస్తే కేసులు తప్పవన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, వాహనాల యజమానులపై, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని, న్యూ ఇయర్ వేడుకల పేరుతో ప్రజా భద్రతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని తెలిపారు. టపాసులు, మైకులు వినియోగించి ప్రజలను ఇబ్బంది పెట్టితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.