|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 03:26 PM
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను రెండుసార్లు గెలిపించిన హైదరాబాద్ ప్రజలకు కేటీఆర్ పాదాభివందనం చేశారు. శేరిలింగంపల్లికి చెందిన కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు తప్ప మరేమీ చేయడం లేదని విమర్శించారు. మేడిగడ్డను కూల్చివేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చెక్‌డ్యామ్‌లను కూడా పేల్చివేస్తున్నారని మండిపడ్డారు. హామీల గురించి ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారని, పెంచుతామన్న పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారో ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలన్నీ రేవంత్ రెడ్డి ఎగవేశారని, పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి తట్టుకోలేడని కేటీఆర్ వెల్లడించారు.