|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 04:13 PM
TG: మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టుల బేసిన్‌లు కూడా సరిగ్గా తెలియవని, ఏ ప్రాజెక్టు ఏ బేసిన్‌లో ఉందో చెప్పలేరని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో కృష్ణా నీటి వినియోగం అతి తక్కువగా జరిగిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకుందని రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మండిపడ్డారు.