|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 10:47 AM
గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కుటుంబ గొడవల కారణంగా భర్త గోవింద్ తన భార్య జమ్ములమ్మ (28)ను కర్రతో కొట్టి హత్య చేశాడు. గొడవను అడ్డుకున్న పెద్దకొడుకు మల్లికార్జున్‌పై కూడా దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. జమ్ములమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన మల్లికార్జున్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.