|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:56 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 5 రోజుల్లో రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.