|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 03:01 PM
ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలానికి రంగం సిద్ధమైంది. అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనా వేదికగా ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ వేలం ప్రారంభం కానుంది. మొత్తం పది ఫ్రాంచైజీలు తమ జట్లలోని ఖాళీలను భర్తీ చేసుకునేందుకు పోటీపడనున్నాయి.ఈసారి వేలం బరిలో మొత్తం 369 మంది ఆటగాళ్లు ఉన్నారు. కామెరూన్ గ్రీన్, వెంకటేశ్ అయ్యర్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి స్టార్ ప్లేయర్లపై ఫ్రాంచైజీలు భారీ మొత్తాలు వెచ్చించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. ఇక, మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధికంగా రూ.64.3 కోట్ల పర్స్‌తో వేలంలోకి అడుగుపెడుతోంది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.43.40 కోట్లు ఉన్నాయి.పది ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 77 స్లాట్లను భర్తీ చేయాల్సి ఉండగా, వాటి వద్ద రూ.237.55 కోట్లు అందుబాటులో ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 స్లాట్లను (ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో సహా) భర్తీ చేయాల్సి ఉండగా, వారి వద్ద రూ.25.50 కోట్ల పర్స్ ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ అత్యల్పంగా కేవలం రూ.2.75 కోట్ల పర్స్‌తో వేలంలో పాల్గొననుండటం గమనార్హం.