|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 02:59 PM
రాష్ట్రములో ఇంటర్ సెకండియర్ పరీక్షలకు సంబంధించి ఒక తేదీలో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 3న జరగాల్సిన పరీక్షను మార్చి 4న నిర్వహించనున్నట్లు పేర్కొంది. హోలీ పండుగ సందర్భంగా ఈ మార్పులు చేసినట్లు వివరించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో వెలువడనున్నట్లు అధికార వర్గాల సమాచారం.హోలీ పండుగ మార్చి 4న జరుగుతుందనే ఉద్దేశంతో ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్ ను రూపొందించింది. అయితే, ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన సాధారణ సెలవుల జాబితాలో మార్చి 3న హోలీ పండుగ సెలవు రోజుగా ప్రకటించింది. దీంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మిగతా పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని అధికారులు తెలిపారు.