|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:43 PM
శీతాకాల విరామానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం హైదరాబాద్ రాకబోతోంది. రేపు మధ్యాహ్నం 2.25 గంటలకు ఆమె ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరనున్నారు.డిసెంబర్ 17 నుంచి 22వ తేదీ వరకు మొత్తం ఐదు రోజుల పాటు ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో బస చేస్తారు. డిసెంబర్ 19న ఉదయం 11 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల నేషనల్ కాన్ఫరెన్స్‌ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.డిసెంబర్ 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో జరిగే సదస్సులో ఆమె హాజరు కావడానికి ప్లాన్ చేశారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వం సమీక్షించింది. సైబరాబాద్ పరిధిలో డ్రోన్ల ఎగురవేతకు పరిమితులు విధించగా, అల్వాల్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలో 17 నుంచి 22 వరకు డ్రోన్లు, పారా-గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎగురవేత నిషేధించబడింది. భద్రతా చర్యల కోసం బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద ఉన్నత పోలీస్ అధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.