|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 08:35 PM
తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 4,158 స్థానాల్లో ఎక్కువ చోట్ల కాంగ్రెస్ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. రాత్రి 7.50 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 1772, BRS 903, బీజేపీ 169, ఇతరులు 379 సర్పంచ్ స్థానాల్లో గెలు పొందారు. మూడో దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా.. 11 సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,752 సర్పంచి పదవులకు బుధవారం పోలింగ్ జరిగింది.