|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:19 PM
TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్ ముగియనుందని తెలిపింది. ఎన్నికల నిర్వహణకు సహకరించిన ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణికుముదిని ధన్యావాదాలు తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన ఇద్దరు అధికారుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఎక్స్ గ్రేషియా కోసం కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.